అల్పాహారం సరైన సమయానికి తీసుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య తినాలని సలహా ఇస్తున్నారు. మీరు ఉదయం నిద్రలేవగానే మీ శరీరానికి ఎంత వేగంగా శక్తినిస్తే, మీ జీవక్రియ అంత వేగంగా జరుగుతుందని సూచిస్తున్నారు.
అయితే అల్పాహారం మానేయడం ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి భోజనానికి, అల్పాహారానికి మధ్య చాలా గ్యాప్ ఉండటం వల్ల జీర్ణక్రియకు అవసరమైన యాసిడ్ ఉదయాన్నే వెలువడుతుంది. దీంతో ముందుగా నీళ్లు తాగి, ఆ తర్వాత ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఇడ్లీ, దోసె వంటి వాటిని తినాలి. యాసిడ్ స్రవిస్తున్నప్పుడు ఆకలితో ఉంటే అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంది.