కాలేజీ, ఆఫీస్, మాల్ ఇలా ఎక్కడికి వెళ్లినా లిఫ్ట్‌ను ఉపయోగించకుండా మెట్లు ఎక్కి దిగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. రోజూ మెట్లు ఎక్కడం వల్ల గుండెకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెట్లు ఎక్కడం వల్ల శరీరంలోని కొవ్వులు సులభంగా కరిగిపోతాయి. అలాగే కాలి కండరాలు దృఢంగా మారి శరీరం పునరుజ్జీవనం పొందుతుంది.
కాఫీ ఖాళీ కడుపుతో తాగుతున్నారా?
చాలా మంది ఉదయాన్నే కాఫీ తాగకపోతే ఏ పనీ చేయలేరు. అయితే కాఫీలో గుండె జబ్బులు, మధుమేహం, అల్జీమర్స్ వ్యాధులను నివారించే గుణాలు ఉన్నప్పటికీ.. ఖాళీ కడుపుతో తాగడం హానికరని నిపుణులు చెబుతున్నారు. అలా తాగితే కార్టిసాల్ పెరిగి ఒత్తిడికి గురిచేస్తుందని తెలిపారు. అల్పాహారం తర్వాత తాగడం ఇంకా మంచిదని సూచిస్తున్నారు. అలాగే రోజంతా పుష్కలంగా నీరు కూడా తాగాలని పేర్కొన్నారు.