కొరిసపాడు మండలం పమిడిపాడు గ్రామంలో అంగన్వాడి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పౌష్టికాహార పక్షోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ కృష్ణవేణి పాల్గొని బాలింతలు, గర్భిణీ స్త్రీలకు పలు సూచనలు చేశారు. అంగన్వాడి కేంద్రాలలో అందించే పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని ఆమె కోరారు.