గోంగూరలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.గోంగూరలో క్యాల్షియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి మరియు ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. రేచీకటితో బాధపడేవారు గోంగూర తింటే ఫలితం ఉంటుంది. అలాగే దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడేవారు గోంగూర తింటే మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా వాంతులు విపరీతంగా ఉన్నప్పుడు కొండ గోంగూర నుంచి తీసిన జిగురు నీళ్లలో కలిపి తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. అయితే కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు గోంగూరకు దూరంగా ఉండాలి.