చంద్రబాబు చేసిన ధర్మపోరాటాల దీక్షలు ఏం అయ్యాయి..? ఢిల్లీలో సభలు పెట్టి ఏం సాధించారు?. పాచిపోయిన లడ్డూలు అన్న పవన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు, బీజేపీతో కలిశారో చెప్పాలని ఎంపీ భరత్ డిమాండ్ చేశారు. అసలు బ్యాంకు లోన్ అనే పదం చంద్రబాబు నోట ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ అని చంద్రబాబు మోసం చేశాడని, బాబు అధికారంలో ఉన్నంతకాలం మోసానికి గురవ్వని వర్గం లేదన్నారు. 2014లో పొత్తులతో గెలిచిన చంద్రబాబు.. రాష్ట్రానికి ఏం చేశారు?. నిలువునా రాష్ట్రాన్ని మోసం చేశారా లేదా? అని నిలదీశారు. సీఎం వైయస్ జగన్ కేంద్రంతో పొత్తు లేకపోయినా ఏపీకి ఎన్ని అభివృద్ధి పనులు చేశారో కనపడటం లేదా?. సీఎం వైయస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలు కనపడటం లేదా? అని ఎంపీ మార్గాని భరత్ ప్రతిపక్షాలను ప్రశ్నించారు.