వేసవిలో ఆకుకూరలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందులో మెంతికూర మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎండాకాలంలో సాధారణంగా వేధించే డీహైడ్రేషన్‌కి మెంతికూరలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, అనేక ఇతర పోషకాలున్నాయి. మెంతికూర తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుకుంటూ, తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.