ఉబర్‌కు వినియోగదారుల కోర్టు షాకిచ్చింది. ప్రయాణికుడి నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడంపై రూ.20 వేల జరిమానా విధించింది. చండీగఢ్‌కు చెందిన అశ్వనీ ప్రశార్ ఉబర్ యాప్‌లో క్యాబ్ బుక్ చేసుకునే సమయంలో ఛార్జీ రూ.359 అని చూపించింది.
గమ్యాన్ని చేరుకున్నాక రూట్ డీవియేషన్‌ల కారణంతో ట్రిప్ ఛార్జీ 8.83 కి.మీ దూరానికి రూ.1,334 అని రావడంతో అతడు కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం కోర్టు ఉబర్ సంస్థకు జరిమానా విధించింది.