ఎండాకాలంలో వాడదెబ్బ తగలకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సూర్యకిరణాలు, వేడిగాలికి గురికాకూడదని వైద్యులు సూచిస్తున్నారు. రోడ్ల మీద చల్లని రంగు పానీయాలు తీసుకోరాదని, రోడ్ల మీద అమ్మే కలుషిత ఆహారం తినరాదని చెబుతున్నారు.
ఎందుకంటే రుచి కోసం ఆరోగ్యాన్ని నాశనం చేసే రంగులు, పదార్థాలు అందులో వాడుతారు. వేసవిలో మాంసాహారం తగ్గించాలి. మద్యం కూడా సేవించరాదు. ఎండ వేళల్లో శరీరంపై భారం పడకుండా శ్రమ గల పనులు చేయరాదన్నారు. నలుపు దుస్తులు, మందంగా ఉన్న దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు.