ప్రతి రోజు ఉదయాన్నే దానిమ్మ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పరగడుపునే దానిమ్మ జ్యూస్ తాగితే శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి. గుండె జబ్బులను దూరం చేస్తుంది. మలబద్దకం, అజీర్ణం సమస్యలు, విరేచనాలను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవకుండా సహాయపడుతుంది.
ఖర్జూరం తినడం వలన కలిగే ప్రయోజనాలు
ఖార్జురం మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎముకలను బలోపేతం చేస్తుంది. రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది. స్త్రీ, పురుషులిద్దరిలోనూ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. బలహీనతను తొలగిస్తుంది. రక్తహీనతకు మేలు చేస్తుందని విద్య నిపుణులు చెబుతున్నారు.