కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా గ్రామ పట్టణ వాలంటీర్లు ప్రభుత్వం పరికరాల్లో ఉండే డేటాను (మొబైల్, స్టార్ టెక్ డివైజెస్)లను ఉపయోగించి ఓటర్లను ప్రలోబలకు గురి చేస్తున్నారని వెంటనే వాటిని స్వాధీనం చేసుకోవాలని తెదేపా కళ్యాణదుర్గం తరపున దేవినేని అవినాష్ చౌదరి రిటర్నింగ్ అధికారికి బుధవారం ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ కళ్యాణదుర్గం పనిచేయుచున్న వాలంటీర్లు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా చూడాలన్నారు.