కంబదూరు మండల కేంద్రంలో మురళి అనునతడు కర్ణాటక మద్యం విక్రయిస్తున్నట్లు రాబడిన సమాచారం మేరకు కాపు కాచి మూకుమ్మడిగా దాడి చేసి అతని వద్దనుండి 62 టెట్రా పాకెట్స్ స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ ఆంజినేయులు బుధవారం విలేఖరులకు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, రిమాండ్ నిమిత్తం కళ్యాణదుర్గం కోర్టుకు తరలించామని ఆయన తెలిపారు. ఎక్కడైనా అక్రమంగా మద్యం అమ్మినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa