అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 244 పాయింట్లు నష్టపోయి 72,396 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లు కుంగి 21,961 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.26 వద్ద ప్రారంభమైంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 244 పాయింట్లు నష్టపోయి 72,396 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లు కుంగి 21,961 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.26 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్-30 సూచీలో సన్‌ఫార్మా, ఐటీసీ, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.