గుడ్ ఫ్రైడే అంటే క్రైస్తవుల ప్రకారం మానవాళి చేసిన పాపాల కోసం జీసస్ తన ప్రాణాలను సిలువపై పణంగా పెట్టారని చెబుతారు. జీసస్‌ను సిలువపై వ్రేలాడదీసిన రోజును పవిత్ర శుక్రవారం లేదా బ్లాక్ ఫ్రైడేగా పిలుస్తారు. యేసు ప్రభువు చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు. ఈ రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవుడిని తలుచుకుంటారు. చర్చికి వెళ్లి ప్రార్థనలో గడుపుతారు. తాము చేసిన పాపాల నుంచి రక్షించమని వేడుకుంటారు.