గొంతు సమస్యలతో బాధపడితే నిమ్మరసం బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకొని తీసుకుంటే తక్షణమే పరిష్కారం ఉంటుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి నిగనిగలాడే చర్మాన్ని సొంతం చేస్తుంది.
నిమ్మ రసంతో శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కిడ్నీలో రాళ్ల సమస్య రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ నిమ్మరసాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.