2024 ఐపీఎల్ లో భాగంగా నిన్న కోల్‌కతా నైట్ రైడర్స్ vs డీల్లి క్యాపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ గెలిచి తమ ప్లేఆఫ్ ఛాన్స్ నిలబెట్టుకందనే చెప్పాలి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుగా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా (13), జేక్ ఫ్రేజర్ (6) త్వరగా ఔట్ అయిపోయారు. తర్వాత వచ్చిన అభిషక్ పోరెల్ (18), షాయ్ హోప్ (6) వెంట వెంటనే వికెట్ పడిపోవడంతో ఢిల్లీ ఇంక కోలుకోలేక పోయింది. 6.4 ఓవర్లకే 4 వికెట్లు పడిపోయాయి. అప్పటికి స్కోరు 68 మీద ఉంది. అక్షర్ పటేల్ (15) కూడా అదే పరిస్థితి. ఇక ట్రిస్టన్ స్టబ్స్ (4), కుమార్ కుశాగ్ర (1), రశిక్ సలాం (8) వెంట వెంటనే ఔట్ అయిపోయారు. ఇలా 14.3 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులతో అవుట్ అవ్వగా ఢిల్లీ ఒత్తిడి లోకి వెళ్లిపోయింది. కులదీప్ యాదవ్ 26 బంతుల్లో 35 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అందులో ఒక సిక్స్, 5 ఫోర్లు ఉన్నాయి. తానే హైయిస్ట్ స్కోరర్ గా నిలిచాడు. కోల్ కతా బౌలింగులో మిచెల్ స్టార్క్ 1, వైభవ్ 2, హర్షిత్ రాణా 2, సునీల్ నరైన్ 1, వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీసుకున్నారు.
తర్వాత ఛషింగ్ కి దిగిన ఓపెనర్ సునీల్ నరైన్ (15) త్వరగా ఔట్ అయిపోయాడు. అయితే మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ మాత్రం ఎలాంటి తత్తరపాటు లేకుండా ఫటాఫట్ దంచి కొట్టాడు. 33 బంతుల్లో 5 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 68 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన రింకూసింగ్ (11) పరుగులు మాత్రమే చేసాడు. కానీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జాగ్రత్తగా ఆడాడు. 23 బంతుల్లో 33 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తనకి వెంకటేష్ అయ్యర్ (26) సపోర్ట్ గా నిలిచాడు. మొత్తానికి 16.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఢిల్లీ బౌలింగులో అక్షర్ పటేల్ 2, విలియమ్స్ 1 వికెట్ పడగొట్టారు.