టీంఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన 36వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అయితే అతను గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఎందుకంటే తన ఆట తీరుతో తానును తానే పరిచయం చేసుకున్నాడు రోహిత్ శర్మ. క్రికెట్ అభిమానులు ఆయన్ని ముద్దుగా హిట్‌మ్యాన్ అని పిలుచుకుంటారు. క్రికెట్ గ్రౌండ్‌లోకి దిగాడంటే చాలు ప్రేక్షకుల ఆనందం అంతాఇంతా కాదు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఆడుతాడు. అభిమానులు ఆ విధంగా ఎంజాయ్ చేసేలా తన బ్యాట్‌కు పని చెబుతాడు.రోహిత్ శర్మ తల్లి విశాఖపట్నానికి చెందినవారు కాబట్టి రోహిత్ శర్మకు తెలుగు ప్రజల్లో ఫ్యాన్ బేస్ కూడా ఏర్పర్చుకున్నాడు . 1999లో తొలిసారి బ్యాట్ పట్టిన రోహిత్, మరో ఏడేళ్ల తర్వాత జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. టెస్టు, వన్డే, టీ20 ఇలా అన్ని ఫార్మాట్లలో కలిసి 18 వేల పైచిలుకు పరుగులు చేశాడు రోహిత్‌శర్మ. టెస్టుల్లో 4 వేలు, వన్డేల్లో 10వేలు, టీ20 మ్యాచ్‌ల్లో 3974 పరుగులు చేశాడు. అంతేకాదు 48 సెంచరీలు నమోదు చేశాడు. అంతేకాదు 597 సిక్సర్లు బాదిన రికార్డు కూడా ఆయన సొంతం చేసుకున్నాడు. ఇక IPL విషయానికి వస్తే ఆరున్నర వేలకు పైగా పరుగులు చేసి ముంబై ఇండియన్స్ కి ఏకంగా 5 ఐపీఎల్ కప్ లను అందించి బెస్ట్ కెప్టెన్ గా ఎదిగాడు. మరో నెల తర్వాత టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో కూడా టీంఇండియాకి నాయకత్వం వహించనున్నాడు రోహిత్ శర్మ