అమెరికా మరియు వెస్టిండీస్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ నిబంధనల ప్రకారం మే ఫస్ట్ న, ప్రపంచకప్ లో ఆడుతున్న ప్రతి జట్లు తమ టీమ్ లను ప్రకటించాల్సి ఉంది. దీంతో బీసీసీఐ భారత జట్టును ఎంపిక చేసింది. ఈ టీం లో ఐపీఎల్ లో మంచి పెరఫామెన్స్ చూపుతున్న ఆటగాళ్లకు టీ 20 వరల్డ్ కప్ లో చోటు కల్పించింది. ఒక్క రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మినహాయించి అంతా కుర్రాళ్లకే అవకాశాలు కల్పించింది బీసీసీఐ. బీసీసీఐ ప్రకటించిన టీ 20 వరల్డ్ కప్ కి భారత జట్టు ఇదే రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్య కుమార్, శివమ్ దూబే, పంత్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, బుమ్రా, కుల్దీప్ యాదవ్, చాహల్, సిరాజ్, అర్ష్ దీప్ సింగ్ ను ఎంపిక చేసింది. ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లుగా శుభమన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్ లను ఎంపిక చేసింది. వరల్డ్ కప్ లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు చోటు దక్కకపోవడం హాట్ టాపిక్ గా మారింది. స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ మరియూ పేస్ బౌలర్ షమీకి జట్టులో చోటు దక్కకపోవడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జూన్ 2 నుండి టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు మొదలవుతాయి.