ఐపీఎల్ లో భాగంగా నిన్న చెన్నై చిదంబరం స్టేడియంలో చెన్నైసూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. చెన్నై సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగు ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నయ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ ఆజ్యింకా రహాన్ (29) పరుగులు చేయగా మరో ఓపెనర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అదే ఫామ్ తో ఆడుతూ 48 బంతుల్లో 62 పరుగులు చేశాడు. వీటిలో 2 సిక్స్ లు, 5 ఫోర్లు ఉన్నాయి. శివమ్ దుబె డక్ ఔట్ గా అయ్యాడు . రవీంద్ర జడేజా (2), సమీర్ రిజ్వి (21), మొయిన్ ఆలి (15), ఎంఎస్ ధోనీ (14) తలో కిన్ని పరుగులు చేసారు. మొత్తానికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి చెన్నయ్ 162 పరుగులు చేసింది. "పంజాబ్ బౌలింగులో రబాడ 1, హర్ ప్రీత్ 2, రాహుల్ చాహర్ 2 వికెట్లు పడగొట్టారు. కానీ అర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో అత్యధికంగా 52 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ తీశాడు
163 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ ప్రభసిమ్రాన్ సింగ్ (13) ఔట్ అయిపోయాడు. జానీ బెయిర్ స్టో మాత్రం 30 బంతుల్లో 1 సిక్స్, 7 ఫోర్ల సాయంతో 46 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తర్వాత ఫస్ట్ డౌన్ వచ్చిన రిలీ రొసోవ్ ధనాధన్ ఆడాడు. 23 బంతుల్లో 2 సిక్స్ లు, 5 ఫోర్ల సాయంతో 43 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివర్లో శశాంక్ సింగ్ (25 నాటౌట్), కెప్టెన్ శామ్ కర్రన్ (26 నాటౌట్) ఇద్దరూ జాగ్రత్తగా ఆడి 17.5 ఓవర్లలో 163 పరుగులు చేసి పంజాబ్ కి ఘన విజయాన్ని అందించారు. "చెన్నై బౌలింగులో శార్దూల్ ఠాకూర్ 1, రిచర్డ్ గ్లెసన్ 1, శివమ్ దుబె 1 వికెట్ తీశారు.