2024 ఐపీఎల్ లో భాగంగా నిన్న ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ ముంబై వాంఖడే స్టేడియం వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కోల్‌కతా 24 పరుగుల తేడాతో గెలుపు సాధించింది. ముంబై మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా మొదట బ్యాటింగ్ కి దిగిన కోల్‌కతా ఓపెనర్ల దగ్గర నుంచి మొదలు పెడితే వరసగా 4 వికెట్లు ధనాధన్ మని పడిపోయాయి. ఫిల్ సాల్ట్ (5), సునీల్ నరైన్ (8), అంగ్ క్రిష్ రఘువంశీ (13), కెప్టెన్ శ్రేయాస్ (6) ఇలా ఒకరి తర్వాత ఒకరు ఔట్ అయిపోయారు. కానీ వెంకటేష్ అయ్యర్ మాత్రం 52 బంతుల్లో 3 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన రింకూసింగ్ (9) ఈసారి కూడా ఆకట్టుకోలేక పోయాడు. మళ్లీ మనిష్ పాండే నిలబడ్డాడు. 31 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. తర్వాత ఎవరూ పెద్దగా ఆడలేదు. దీంతో 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ అయ్యింది. "ముంబై బౌలింగులో నువాన్ తుషారా 3, బుమ్రా 3, హార్దిక్ పాండ్యా 2, పియూష్ చావ్లా 1 వికెట్ పడగొట్టారు.
170 పరుగుల లక్యంతో చేసింగ్ కి దిగిన ముంబై ఇండియన్స్ ఇచ్చారు ఓపెనర్లు నిరాశపరిచారు. ఇషాన్ కిషన్ (13), రోహిత్ శర్మ (11) తక్కువ స్కోరుకే ఔట్ అయ్యారు. ఫస్ట్ డౌన్ వచ్చిన నమన్ ధిర్ (11) నిలవలేదు. సూర్య కుమార్ యాదవ్ మాత్రం కొద్దిగా నిలకడగా ఆడాడు 35 బంతుల్లో 2 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. కొద్దిసేపటికి సూర్య ఔట్ అవ్వగా తర్వాత వచ్చిన టిమ్ డేవిడ్ 24 పరుగులతో విజయానికి దగ్గరగా తీసుకెళ్లాడు కానీ అనుకోని రీతిలో టీం డేవిడ్ ఔట్ అవ్వడంతో ముంబై ఓటమి దాదాపు ఖాయమైపోయింది. చివరికి 18.5 ఓవర్లలో 145 పరుగుల వద్ద ముంబై ఆగిపోయింది. అలా 24 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. "కోల్ కతా బౌలింగులో మిచెల్ స్టార్క్ 4, వరుణ్ 2, సునీల్ నరైన్ 2, ఆండ్రి రెసెల్ 2 వికెట్లు పడగొట్టారు.