2024 ఐపీఎల్ లో భాగంగా నేడు గుజరాత్ మరియూ ఆర్సీబీ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ బెంగుళూర్ చిన్నస్వామి స్టడియంలో రాత్రి 7. నిమిషాలకు జరగనుంది. ఆర్సీబీ తమ చివరి రెండు మ్యాచ్ లలో అద్భుతంగా ఆడి గెలుపును పొందింది. ఈ మ్యాచ్ కూడా గెలిచేందుకు ప్లాన్ చేస్తుంది. గుజరాత్ టైటాన్స్ టీమ్ కూడా మళ్లీ విజయాలను నమోదు చేసేందుకు వ్యూహాలు రచిస్తుంది. గుజరాత్ గత 10 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఆరు ఓటములతో పాయింట్ల పట్టికలో 8 స్థానంలో ఉండగా, ఆర్సీబీ మాత్రం 10 మ్యాచ్‌ల్లో మూడు గెలిచి, 7 ఓడిపోయి చివరి స్థానంలో ఉంది.
అయితే బెంగళూరులో ఈరోజు వర్షం పడే ఛాన్స్ తక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, చిన్నస్వామి మైదానం బ్యాట్స్‌మెన్లకు అనుకూలంగా ఉంటుంది. చిన్న బౌండరీ కారణంగా ఈ గ్రౌండ్ లో ఫోర్లు, సిక్సర్లు ఈజీగా కొట్టొచ్చు. ఇక్కడ స్పిన్ బౌలర్లకు కూడా పిచ్ నుంచి మంచి సపోర్ట్ దొరుకుతుందని క్రీడా నిపుణులు అంటున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగనుంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 4 మ్యాచ్ లు జరిగాయి. 2 గుజరాత్, 2 ఆర్సీబీ విజయం సాధిచి సమానంగా వున్నాయి. ఈ మ్యాచ్ లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.