ప్రస్తుతం మెంతులు అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో వాడుకునే సర్వసాధారణమైన వంట దినుసు. ఈ మెంతులలో ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ తో పాటుగా ఫైబర్, విటమిన్, ఖనిజాలు సమృద్ధిగా అందుతాయి.మెంతి ఆకు, మెంతి గింజలను కూడా ఆహారంలో తీసుకుంటూ ఉంటాము. ఇది వంటకు మంచి రుచిని కూడా ఇస్తుంది. నిలువ పచ్చళ్లలో కూడా ఈ మెంతుల పాత్ర ముఖ్యమైనది. ఆహారంతో పాటుగా మెంతులను ఆయుర్వేదంలో కూడా ఔషధాల తయారి లో ఉపయోగిస్తారు. అంతేకాక మెంతులు మధుమేహం ఉన్నవారికి ఒక దివ్య ఔషధం లాంటిగా పనిచేస్తుంది. ఈ మెంతులను రాత్రిపూట నానబెట్టుకొని మెంతులను గోరువెచ్చని నీటితో ఉదయం లేవగానే తీసుకోవటం వలన ఎన్నో అద్భుత ప్రయోజనాలు అందుతాయి. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం
మెంతులను నానబెట్టుకొని ఉదయం లేవగానే తీసుకున్నట్లయితే మన శరీరంలోని ఎన్నో రుగ్మతలకు చెక్ పెట్టొచ్చు. దీనిని ఉదయం తీసుకోవటం వలన అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం లాంటి జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది. మెత్తినీరు ఆకలిని కూడా తగ్గిస్తుంది. జీవక్రియ రేటును కూడా పెంచడంలో ఎంతో మేలు చేస్తుంది. కొవ్వు పేరుకు పోవడానికి కూడా తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవటం వలన హెల్ డి ఎల్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మెంతు నీరు రక్తంలోని ఇన్సులిన్ నిరోధకతతో ప్రయోజనకరంగా పనిచేయగలదు. ఖాళీ కడుపుతో మెంతి గింజల నీటిని తాగటం వలన జర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటం మరియు తగ్గిన కొలెస్ట్రాల్, బరువు తగ్గేందుకు,మద్దతు లాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
ఈ మెంతులలో యాంటీ ఆక్సిడెంట్ రీచ్ కూర్పు రోగనిరోధక వ్యవస్థను బలంగా చేస్తుంది. వాపును కూడా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా ఎంతో ప్రోత్సహిస్తుంది. కరిగే ఫైబర్ దీనిలో పుష్కలంగా ఉంటుంది. కావున మెతి గింజలు జీర్ణ వ్యవస్థ ద్వారా ఆహారానికి సంబంధించిన కదలికలను సులభం చేయడం ద్వారా జీవక్రియలో కూడా ఎంతో సహాయం చేస్తుంది. మెంతి నీరు తీసుకోవటం వలన సంపూర్ణత్వం అనుభూతిని అందించడమే కాక, అధిక కేలరీలు తీసుకోవటం తగ్గించటం వలన బరువు నిర్వాహణలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే సామర్థ్యంతో మెంతులు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అవసరమైనటువంటి విటమిన్లు,మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లతో శక్తిని బలంగా చేస్తాయి. ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా శరీరానికి రక్షణను కూడా ఇస్తుంది. రుతుక్రమంలో వచ్చే నొప్పుల నుండి కూడా ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. రుతు చక్రాన్ని క్రమబద్ధీకరించేందుకు ఇది ఎంతో మేలు చేస్తుంది. తిమ్మిరి, ఉబ్బరం లాంటి లక్షణాలను కూడా ఉపశమనం కలిగించే ప్రయోజనకరమైన లక్షణాన్ని కలిగి ఉంటాయి. అలాగే మెంతులను నానబెట్టి తలకు పట్టించుకున్నట్లయితే జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది…