మృగశిర కార్తె వచ్చేసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారిపోతుంది. అయితే ఈ మృగశిర రోజున తప్పకుండా చేపలు తినాలని చెబుతుంటారు.ఇక ఆరోజు ఫిష్‌కు ఉండే గిరాకి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే అసలు మృగశిర రోజు మాత్రంమే చేపలకు ఎందుకు గిరాకి పెరుగుతోంది? ఆరోజు ఫిష్ ఎందుకు తినాలి. దీని వలన ఏమైనా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
రోహిణి కార్తె సమయంలో ఎండలు దంచి కొడుతాయి. అయితే అంతకు ముందు కూడా ఎండ వేడితో ప్రజలు అల్లాడి పోతుంటారు. కానీ మృగశిర కార్తెతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. దీంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. దీని వలన అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. జ్వరం, దగ్గు లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే వాటన్నింటి నుంచి ఉపశమనం కోసం, అలాగే మన శరీరంలో వేడి ఉండేందుకు, రోగనిరోధక శక్తి పెరగడానికి చేపలు తింటారు. కొన్ని ప్రాంతాల్లో బెల్లంలో ఇగువ కలుపుకొని తింటారు.
చేపలు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :
మృగశిర కార్తె రోజు చేపలు తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది.
గర్భిణీలు, చేపలను తినడం వలన పాలు సరిపడినంతగా పడుతాయి. అంతే కాకుండా వ్యాధినిరోధక శక్తి పెరిగి, నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది.