కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి బీ. ఏ, బీ. యస్సీ, బీ. కాం కోర్సుల్లో ప్రవేశానికి ఆన్లైన్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవికుమార్ బుధవారం తెలిపారు. విద్యార్ధులు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్లు చేసుకొనేందుకు జూలై 2 నుండి పదో తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు.