మన శరీరంలో ఏదైనా విటమిన్ లోపం వలన ఎన్నో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం విటమిన్ డి లోపం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం అయ్యింది.దీని లోపం వలన రోగనిరోధక వ్యవస్థపై కూడా ఎంతో ప్రభావం పడటంతో పాటు ఎముకల బలహీనతకు కూడా దారి తీస్తుంది. అయితే విటమిన్ డి శరీరంలో బోలు ఎముకల వ్యాధి,రికెట్స్ లాంటి సమస్యల ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. అయితే శరీరంలో విటమిన్ డి అవసరమైన మొత్తాల్లో లేకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే విటమిన్ డి జలుబు మరియు దగ్గు మరియు ఫ్లూ లాంటి సమస్యల నుండి కూడా రక్షిస్తుంది. ఇక కండరాల బలాన్ని కూడా ఎత్తగానే పెంచేందుకు పని చేస్తుంది. సూర్యుని కిరణాల నుండి మన శరీరం డి విటమిన్ తీసుకుంటుంది. అయితే ఆహారం గురించి చెప్పాలి అంటే. ట్యూనా ఫిష్, గుడ్డు పచ్చ సోనా, పుట్టగొడుగులలో కూడా విటమిన్ డి అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కానీ సూర్యరశ్మీ లో ఉండకపోవడం వలన ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోకపోతే శరీరంలో విటమిన్ డి లోపం వచ్చే అవకాశం ఉంది. దీని లోపం వలన వచ్చే లక్షణాలు శరీరంలో కూడా కనిపించటం మొదలవుతుంది. కానీ ప్రజలు దాని గురించి పెద్దగా తెలుసుకోలేకపోతారు. ఇలాంటి పరిస్థితులలో విటమిన్ డి లోపం గుర్తించటం చాలా అవసరం. అయితే ఈ విటమిన్ డి లోపం ఎలా గుర్తించాలో తెలుసుకుందాం…
విటమిన్ డి లోపం వలన శరీరంలో అలసట అనేది ఏర్పడుతుంది అని ఢిల్లీలోని జిటిబి హాస్పిటల్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ అంకిత్ కుమార్ తెలిపారు. దీని లోపం వలన ఒకసారిగా శక్తి స్థాయి అనేది పడిపోవడం మొదలవుతుంది. అంతేకాక ఎముకల నొప్పి కూడా స్టార్ట్ అవుతుంది.ఈ సమస్య అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ విటమిన్ డి లోపం మీ మెదడు ఆరోగ్యాన్ని కూడా ఎంతో ప్రభావితం చేయగలదు. ఇది మానసిక కల్లోలం, విచారం, నీరసం, ఆందోళన లాంటి సమస్యలను కూడా కలిగించగలదు. ఈ విటమిన్ డి అనేది న్యూరో ట్రాన్సిట్లర్ల కు సంబంధించింది. ఇది మెదడులోని భావోద్వేగాలను తగ్గించేందుకు కూడా ఈ న్యూరో ట్రాన్స్ మీటర్లు అనేవి బాగా పనిచేస్తాయి. అలాగే విటమిన్ డి అవసరమైనంత లేనప్పుడు న్యూరో ట్రాన్స్ మీటర్లు పనితీరు కూడా దెబ్బతింటుంది. ఇది మానసిక ఒత్తిడికి సంబంధించిన సమస్యలను కూడా కలిగించగలదు. అంతేకాక ఎక్కువసేపు విచారంగా ఉండటం వలన కూడా తలనొప్పి డిప్రెషన్ సమస్యలు వస్తాయి…
ఈ ప్రమాదాలను ఎలా నివారించాలి : ప్రతినిత్యం 15 నుండి 20 నిమిషాల పాటు ఎండలో ఉండండి. అలాగే చేపలు,గుడ్డు పచ్చసోనా, పుట్టగొడుగు లాంటివి తీసుకోవాలి. అంతేకాక పాలు మరియు పాల ఉత్పత్తులను కూడా అధికంగా తీసుకోవాలి. మీ వైద్యుడు సూచించిన విధంగా విటమిన్ డి సప్లిమెంట్లను కూడా తీసుకోవటం మంచిది. అలాగే మీరు ముందుగా విటమిన్ డి గురించి తెలుసుకోవడానికి ఆరోగ్య పరీక్షలు కూడా చేయించుకోవటం చాలా మంచిది. దీని వలన దాని లోపాన్ని తొందరగా గుర్తించవచ్చు…