వర్షాకాలంలో వాతావరణ పరిస్ధితులు మారడంతో జీర్ణ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఈక్రమంలో పోషక విలువలతో కూడిన కూరగాయలను తీసుకోవడం ద్వారా వర్షాకాలంలో తలెత్తే అనారోగ్యాల ముప్పును నివారించవచ్చు. కాకరకాయ, సొరకాయ, బీరకాయ, పాలకూర, మెంతికూర, మునగ, క్యారట్, బీట్రూట్, గుమ్మడి కాయ, బెండకాయలను తింటే రోగనిరోధక శక్తిని మెరుగుపరచటమే కాకుండా సీజనల్ ఇన్ఫెక్షన్లను నివారించేందుకు సాయపడతాయి.