ఆహారంగా కేవలం పండ్లు మాత్రమే తీసుకోవడం అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని అమెరికాకు చెందిన క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ పరిశోధన చెబుతోంది. ఆ సంస్థ ప్రకారం, పండ్లలో సహజ చక్కెరలు రక్తంలోని షుగర్ లెవెల్స్ ను ప్రభావితం చేసి బరువు పెరిగేలా చేస్తాయి. చివరికి అది డయాబెటిస్ కు కారణమవుతుంది. కేవలం పండ్లు మాత్రమే తింటే విటమిన్ బీ12, విటమిన్ డి, కాల్షియం, అయోడిన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల లోపం, దంతక్షయం ఏర్పడుతుంది.