భారత్కు చెందిన ప్రముఖ ఏరోస్పెస్ ఇంజనీర్ రామ్ నారాయణ్ అగర్వాల్ (84) గురువారం ఉదయం కన్నుమూశారు. గత కొన్నిరోజులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. భారత క్షిపణుల్లో మణిహారంగా పేర్కొనే ‘అగ్ని’ని రూపొందించడంలో ఈయనదే ప్రముఖ పాత్ర. అందుకే ఈయనను ఫాదర్ ఆఫ్ ది అగ్ని సిరీస్ ఆఫ్ మిస్సైల్స్గా పిలుస్తుంటారు.