వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలోని అక్రమాలపై టీడీపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవకతవకలు జరిగాయంటూ చంద్రబాబును అరెస్ట్ చేయించారు. అయితే సీఎంవో ఒత్తిడితోనే పోలీసులు అక్రమ కేసులు బనాయించి.. చంద్రబాబును అరెస్ట్ చేశారని అప్పట్లో టీడీపీ ఆరోపించింది. దీనిపై ప్రభుత్వం సమీక్ష చేస్తోంది. అలాగే మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను జగన్ రక్షించాలరనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.