అరటి ఆకులు తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. అరటి ఆకులో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం లభిస్తాయి. అరటి ఆకులను వేసిన నీటిని మరిగించి, తర్వాత వడగట్టి తాగాలి. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అరటి ఆకులతో లభించే రోగనిరోధక శక్తితో వైరల్ ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి. చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలర్జీలు రాకుండా కాపాడుతుంది. రక్తహీనత సమస్య తలెత్తదు.