ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే ఎముకలు పటిష్టంగా ఉంటాయి. అంతేకాకుండా రక్తహీనత సమస్య రాదు. గుండె సంబంధిత సమస్యలు దరి చేరవు. రోజూ గ్లాసు వేడి నీటిలో నిమ్మరసం కలిపి తాగితే చర్మం కాంతి వంతంగా ఉంటుంది. అలర్జీలు కూడా రావు. అయితే అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వారు నిమ్మరసం తాగకపోవడం మంచిది.