ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం తప్పనిసరి. అందులో నడక మంచిది. ఇది దీర్ఘాయువును పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. యూఎస్ సీడీసీ ప్రకారం.. ఒక వ్యక్తి వారానికి కనీసం 150 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ (వేగంగా నడవడం) వంటి వ్యాయామాలు చేస్తే ఎక్కువకాలం జీవించవచ్చని తెలిపింది. వారంలో 5 రోజుల చొప్పున రోజూ కనీసం 3000 అడుగులు వేయాలని పేర్కొంది. రోజులో కనీసం 1000 అడుగులు వేసే వారిలోనూ ఆకస్మిక మరణం ముప్పు తగ్గుతుందని పోలండ్ లోని లాడ్జ్ యూనివర్సిటీ వెల్లడించింది.