ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం లెనెవో అనుబంధ సంస్థ మోటరోలా తన మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎస్వోసీ ప్రాసెసర్, 50-మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుందని సమాచారం. ఈ నెల 29న మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తామని తెలిపింది. సోనీ ఎల్వైటీఐఏ రేర్ కెమెరా, ఫాంటోన్ షేడ్స్, ట్రేడిషనల్ బార్ స్టైల్ డిజైన్‌తో వస్తోంది. పాంటోన్ నాటికల్ బ్లూ, ఫాంటోన్ లాట్టె, పాంటోన్ పొయిన్ సియానా, పాంటోన్ గ్రైసైల్లి కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ మోటరోలా ఎడ్జ్ 50 నియో. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.4 అంగుళాల పోలెడ్ (1220×2670 పిక్సెల్స్) డిస్ ప్లే కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ700 సీ ప్రైమరీ సెన్సర్, 13 -మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా, 10-మెగా పిక్సెల్ టెలిఫోటో సెన్సర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 68 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4310 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.