మద్యం తాగే వారిలో లివర్ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దీర్ఘకాలికంగా మద్యం తాగే వారు ఫ్యాటీ లివర్, లివర్ ఇన్‌ఫ్లమేషన్, స్కార్డ్ లివర్, లివర్ సిర్రోసిస్ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇవి కాలేయ పనితీరును దెబ్బ తీసి, ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడేలా చేస్తాయి. లివర్ ఫంక్షన్ టెస్ట్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకుని తగిన చికిత్స పొందాలని సూచిస్తున్నారు.