ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆరెంజ్ లాంటి పండ్లు తింటే కడుపులో మంటగా అనిపిస్తుంది. ఆరెంజ్ లాంటి సిట్రస్ పండ్లు గ్యాస్ట్రిక్ యాసిడ్ విడుదలను పెంచుతాయి. పేస్ట్రీల లాంటి చక్కెర పదార్థాలు శరీరంలో ఒక్కసారిగా షుగర్ స్థాయిలను పెంచుతాయి.
పచ్చి కూరగాయల్లోని అధిక ఫైబర్, ఉబ్బరానికి దారితీస్తుంది. టొమాటోలను ఖాళీ కడుపుతో తింటే ఎసిడిటీ పెరుగుతుంది. పరగడుపున స్పైసీ ఆహారం తింటే దీర్ఘకాల జీర్ణ సమస్యలొస్తాయని డా.లతా పాటిల్ తెలిపారు.