పారిస్ పారాలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు జోరు మీదున్నారు. తాజాగా తెలుగమ్మాయి 400 మీటర్ల ఈవెంట్‌లో కాంస్యం సాధించింది. దీంతో భారత్ ఖాతాలోకి ఇప్పటి వరకు 20 పతకాలు చేరాయి. గతంలో టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాల రికార్డు బద్దలైంది. పారిస్ పారా ఒలింపిక్స్‌లో భారత్ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. భారత్ ఖాతాలోకి ఇప్పటి వరకు 20 పతకాలు చేరాయి. అందులో మూడు బంగారం, ఏడు రజతం, 10 కాంస్య పతకాలు ఉన్నాయి. తెలంగాణకు చెందిన అథ్లెట్ దీప్తి జీవాంజి టీమ్ కాంస్య పతకం సాధించింది. మంగళవారం రాత్రి జరిగిన 400 మీటర్ల టీమ్ విభాగం ఫైనల్‌లో ఆమె పతకం సాధించింది. దీప్తి 55.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని థర్డ్ ప్లేస్‌తో సరిపెట్టుకుంది. ఉక్రెయిన్ అమ్మాయి షులియార్ 55.16 సెకన్లలో గోల్డ్ అందుకోగా, తుర్కియే ఐజెల్-55.23 సెకన్లతో రజతం సొంతం చేసుకుంది. పారాలింపిక్స్‌లో దీప్తి జీవాంజి కాంస్య పతకం సాధించడంపై సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ విశ్వ క్రీడా వేదికపై విజేతగా నిలిచిన దీప్తి మనందరికీ గొప్ప స్ఫూర్తి అంటూ పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి.. ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపించింది. అంతకుముందు వరకు 400 మీటర్ల టీ-20 విభాగంలో ఈమెదే (55.07 సెకన్లు) ప్రపంచ రికార్డు. ప్రస్తుతం దీప్తి రికార్డు బద్దలైంది. పాఠశాల నుంచి దీప్తికి పరుగుల రాణిగా పేరు ఉండేది. ఆమెని గమనించిన పీఈటీ ప్రొత్సహించారు. ఆ తర్వాత జూనియర్ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్ కఠిన ట్రైనింగ్ తీసుకుంది. అక్కడి నుంచి గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ సెంటర్‌లో జాయిన్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ప్రయాణం సాగుతూ వచ్చింది. చివరకు పారా ఒలింపిక్స్‌లో తన కలను నెర్చుకుంది.