జింబాబ్వే పై విజయం సాధించిన నేపథ్యంలో గిల్ కు నాయకత్వం అప్పగించే విషయంలో బీసీసీఐలో అనేక చర్చలు జరిగాయి. రేపటి నుంచి దులీప్ ట్రోఫీ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో గిల్ కు మరో బంపర్ ఆఫర్ లభించింది.దులీప్ ట్రోఫీలో భాగంగా అతడు ఇండియా – ఏ జట్టుకు కెప్టెన్ గా నియమితుడయ్యాడు. అంతకుముందు అతడు ఐపిఎల్ 2024 సీజన్లో గుజరాత్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇక ఇటీవల శ్రీలంక వన్డే, టి20 సిరీస్ లకు వైస్ కెప్టెన్ గా కొనసాగాడు.. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం గిల్ కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. త్వరలో బంగ్లాదేశ్ జట్టుతో టీమ్ ఇండియా రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడుతుంది.. బుమ్రా ఆ సిరీస్ లో ఆడేది అనుమానంగానే ఉంది. దీంతో గిల్ ను వైస్ కెప్టెన్ గా ప్రకటిస్తారని తెలుస్తోంది. గత కొంతకాలంగా గిల్ స్థిరమైన కెరియర్ కొనసాగిస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్ లో ఆడాడు. టి20 వరల్డ్ కప్ లో ప్లేయింగ్ – 15 లో చోటు దక్కించుకోలేకపోయాడు.. అదనపు ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించుకున్న అతడు.. మధ్యలోనే ఇండియాకు తిరిగివచ్చాడు.. ఇక టీమిండియా సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ జట్టుతో రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు వైస్ కెప్టెన్ గా గిల్ ను ఎంపిక చేయాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. బంగ్లాదేశ్ తో ఆడే జట్టును ప్రకటించినప్పుడు బుమ్రా స్థానంలో గిల్ నూతన వైస్ కెప్టెన్ గా నియమితుడై అవకాశం ఉందని తెలుస్తోంది.
గిల్ టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వకముందు యువరాజ్ సింగ్ వద్ద శిక్షణ పొందాడు. అంతటి కోవిడ్ కాలంలోనూ యువరాజ్ అతడికి శిక్షణ ఇచ్చాడు. కుడి చేతివాటంతో బ్యాటింగ్ చేసే గిల్.. తనదైన రోజు అద్భుతాలు చేయగలడు. ఓపెనర్ గా రోహిత్ శర్మతో కలిసి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. వన్డేలలో డబుల్ సెంచరీ చేశాడు.. అద్భుతమైన ఫుట్ వర్క్ తో బ్యాటింగ్ చేయగల నైపుణ్యం గిల్ సొంతం. ప్రస్తుతం వైస్ కెప్టెన్ గా గిల్ పేరు పరిగణలోకి తీసుకున్న టీమిండియా సెలక్టర్లు.. భవిష్యత్తు కాలంలో గిల్ ను కెప్టెన్ గా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం టి20 జట్టుకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. టెస్ట్, వన్డే జట్టుకు రోహిత్ నాయకత్వం వహిస్తున్నాడు. ఒకవేళ రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తే.. ఆ స్థానం గిల్ తో భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గిల్ వైస్ కెప్టెన్ గా నియమితుడయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అతి పిన్న వయసులోనే అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకోబోతున్నాడని.. నక్కతోక తొక్కి ఉంటాడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.