ఇటీవల బోట్స్ వానాలోని కరోవే గనిలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రం బయటపడింది. 2492 క్యారెట్లు గల ఈ వజ్రం విలువ 40 మిలియన్ డాలర్లు (రూ.335 కోట్లు) ప్రపంచంలోనే అతిపెద్దదైన కుల్లినన్ (3106 క్యారెట్లు) అనే వజ్రాన్ని 1905లో దక్షిణాఫ్రికాలో కనుగొన్నారు. ఈ వజ్రం ధర రూ.3350 కోట్లు. బోట్స్ వానాలో 2019లో లభ్యమైన 1758 క్యారెట్ల సెవెలో వజ్రం 3వ అతి పెద్దదిగా ఉంది. కాగా, దీని ధరను వెల్లడించలేదు.