మార్కెట్లోకి వరుసగా స్మార్ట్ ఫోన్స్ ను విడుదల చేస్తున్న మోటోరోలా లేటెస్ట్ గా ప్రీమియం సెగ్మెంట్ లో మరో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. భారీ కవర్ డిస్ప్లే, అడ్వాన్స్డ్ ప్రాసెసర్ తో ఈ మోటరోలా రేజర్ 50 ని లాంచ్ చేసింది. మోటరోలా రేజర్ 50 అల్ట్రాను లాంచ్ చేసిన తరువాత, ఇప్పుడు తాజాగా రేజర్ 50 ను మోటోరోలా భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఇది క్లామ్ షెల్-స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్. సరికొత్త డిజైన్ తో మోటరోలా రేజర్ 50 ని రూపొందించారు. ఇందులో అప్ గ్రేడ్ చేసిన చిప్ సెట్, గూగుల్ జెమినీ సపోర్ట్ తో కొత్త ఏఐ ఫీచర్లు, పెద్ద కవర్ డిస్ ప్లే తదితర ఫీచర్లు ఉన్నాయి. కొత్త మోటరోలా రేజర్ 50 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లోని ఫీచర్స్, ఇతర వివరాలను ఇక్కడ చూడండి.
మోటరోలా రేజర్ 50 స్పెసిఫికేషన్లు: మోటరోలా రేజర్ 50 లో 3.6 అంగుళాల అమోలెడ్ కవర్ డిస్ ప్లే, ఎల్టీపీఓ టెక్నాలజీతో 6.9 అంగుళాల ఎఫ్ హెచ్ డీ అమోఎల్ఇడి మెయిన్ డిస్ ప్లే ఉన్నాయి. కవర్ డిస్ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను అందిస్తుంది. మెయిన్ స్క్రీన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను అందిస్తుంది. బ్రైట్ నెస్ పరంగా, మోటరోలా రేజర్ 50 1700 నిట్స్, 3000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కు మద్దతు ఇస్తుంది. మోటరోలా రేజర్ 50లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ చిప్ సెట్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఉన్నాయి. ప్రధాన డిస్ ప్లేలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ () లో 33వాట్ వైర్డ్, 15వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేసే 4200 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. మోటరోలా రేజర్ 50 ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. కంపెనీ మూడు సంవత్సరాల ఓఎస్, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్ లను అందిస్తోంది.