గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం రియల్‌మీ భారత్‌లో మరో కొత్త ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇవాళ (శుక్రవారం) రియల్‌మీ పీ2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. గతేడాది మార్కెట్‌లోకి తీసుకొచ్చిన పీ సిరీస్‌లో కొత్తగా దీనిని జోడించింది. కర్వ్డ్ డిస్‌ప్లే, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, అదిరిపోయే బ్యాటరీ కెపాసిటీతో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ అనేక ఫీచర్లు ఇటీవలే ఆవిష్కరించిన రియల్‌మీ 13 ప్లస్ 5జీ మాదిరిగానే ఉన్నప్పటికీ.. ప్రాసెసర్‌తో పాటు కొన్ని హార్డ్‌వేర్ మార్పులు ఉన్నాయి. ఈ ఫోన్ లుక్, డిజైన్ ‘రియల్‌మీ నార్జో 70 టర్బో’ను పోలి ఉన్నాయి.
ధర ఎంతంటే?
రియల్‌మీ పీ2 ప్రో ఫోన్ బూడిద, ఆకుపచ్చ రంగులలో కనిపిస్తుంది. ఈ ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్‌లలో లభిస్తుంది. 8జీ ర్యామ్ + 128జీబీ వేరియెంట్ ఫోన్ ధర రూ.21,999గా ఉంది. ఇక12జీబీ ర్యామ్ + 256జీబీ వేరియెంట్ ధర రూ. 24,999గా, 12జీబీ ర్యామ్ + 512జీబీ మోడల్ ఫోన్ రేటు రూ.27,999గా ఉన్నాయి. బేసిక్ మోడల్‌పై రూ.2000, ఇతర మోడళ్లపై రూ.3000 వరకు ఫ్లాట్ తగ్గింపు ఆఫర్లను కంపెనీ అందిస్తోంది. అయితే ఈ తగ్గింపు ఆఫర్ దీపావళి పండగ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 17న సాయంత్రం 6 గంటల ఈ ఫోన్ల విక్రయాలు ప్రారంభమవుతాయి. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌పై అమ్మకాలు మొదలవుతాయి.
ఫోన్ ఫీచర్లు ఇవే..
రియల్‌మీ పీ2 ప్రో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14, 2000 నిట్‌ల బ్రైట్‌నెస్, 6.7-అంగుళాల కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, రిఫ్రెష్ రేట్ 120హెట్జ్, ప్రత్యేకమైన గొరిల్లా గ్లాస్‌తో ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక కెమెరా విషయానికి వస్తే.. వెనుకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ సెకండరీ డ్యుయెల్ కెమెరా సెటప్ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32ఎంపీల కెమెరాను కంపెనీ అందించింది. బ్యాటరీ సామర్థ్యం 5,200 ఎంఏహెచ్‌గా, 80వాట్స్ యూఎస్‌బీ టైప్-సీ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి.