తెలుగు రాష్ట్రాల్లో గణనాధుని ప్రాచీన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. కాణిపాకం తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన ఆలయం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం. గణనాథుడు స్వయంభువుగా వెలసిన ఈ గణపతి క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది.
ఈ వినాయకుడిని నారికేళ వినాయకుడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకొని కొబ్బరి కాయ కొడితే చాలు తప్పక మన కోరిక నెరవేరుతుందట. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కి.మీ దూరంలో, అమలాపురానికి 12 కి.మీ దూరంలో ఉంది.