బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు ముందు భారత క్రికెట్ జట్టును ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. టెస్టు క్రికెట్ ప్రారంభమైనప్పటికీ నుంచి అందని ద్రాక్షగా ఉన్న ఈ ఫీట్ సాధించేందుకు భారత్ సిద్ధమైంది. చెన్నై వేదికగా జరిగే బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులోనే ఈ రికార్డు సాధించే దిశగా టీమిండియా వడివడిగా అడుగులు వేస్తోంది. అదే జరిగితే టీమిండియా టెస్టు క్రికెట్ చరిత్రలో చెన్నై టెస్టు చరిత్రలో మిగిలిపోనుంది.
రికార్డు ఏంటంటే..
కాగా భారత క్రికెట్ జట్టు ఇప్పటివరకు 579 టెస్టు మ్యాచులు ఆడింది. ఇందులో గెలుపోటముల సంఖ్య సమానంగా ఉంది. ఈ టెస్టులో భారత్ 178 టెస్టుల్లో గెలిచింది. మరో 178 మ్యాచుల్లో ఓడిపోయింది. అత్యధికంగా 222 టెస్టులు డ్రా అయ్యాయి. ఒక మ్యాచ్ టై అయింది. ఈ నేపథ్యంలో భారత జట్టు తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ను ఓడిస్తే.. తొలిసారి ఓటముల కంటే గెలుపుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లవుతుంది. దీంతో ఈ రికార్డుపై భారత్ కన్నేసింది.
విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డు..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పటివరకు టెస్టుల్లో 113 మ్యాచుల్లో 49.15 సగటుతో 8848 రన్స్ స్కోరు చేశాడు. అతడు మరో 152 రన్స్ స్కోర్ చేస్తే.. టెస్టుల్లో 9000 రన్స్ స్కోరు చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో సచిన్ టెండూల్కర్ (15921)ఉన్నాడు. రాహుల్ ద్రవిడ్ (13288), సునీల్ గావస్కర్ (10122)లు విరాట్ కోహ్లీ కంటే ముందు ఉన్నారు.
జడేజా ఆరు వికెట్లు తీస్తే..
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరో ఆరు వికెట్లు తీస్తే.. టెస్టుల్లో 300కు పైగా వికెట్లు తీసిన మడో లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా నిలుస్తాడు. ఈ జాబితాలో శ్రీలంకకు చెందిన రంగన హెరాత్ (463) అగ్రస్థానంలో న్నాడు. న్యూజిలాండ్ స్పిన్నర్ డేనియల్ వెటోరీ (362), ఇంగ్లాండ్‌కు చెందిన డెరెక్ అండర్ వుడ్ (297)లు రవీంద్ర జడేజా కంటే ముందు వరుసలో ఉన్నారు. కాగా భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం బీసీసీఐ కూడా భారత జట్టును ప్రకటించింది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాళ్