ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ లెనోవా ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సర్వర్లను తయారు చేయడం ప్రారంభించింది. పుదుచ్చేరిలోని తన ప్లాంట్‌లో 50,000 ఎంటర్‌ప్రైజ్ AI ర్యాక్ సర్వర్‌లను, 2,400 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల(GPU) ఉత్పత్తిని మొదలుపెట్టంది. ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయిన సర్వర్లు, దేశీయంగా ఉపయోగించుకోవడంతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి వీలవుతుంది.