శాంసంగ్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ M15 5G ప్రైమ్ ఎడిషన్ భారత్‌లో విడుదల అయింది.గెలాక్సీ M15 5G స్టాండర్డ్ మోడల్ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు మూడు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ను శాంసంగ్ వెబ్‌సైట్, అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో తగ్గింపు ధరను పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ M15 5G ప్రైమ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :శాంసంగ్ గెలాక్సీ M15 5G ప్రైమ్ ఎడిషన్ హ్యాండ్‌సెట్ 6.5 అంగుళాల FHD+ (1080*2340 పిక్సల్స్) సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్ రేట్, 19.5:9 యాస్పెక్ట్ రేషియోతో విడుదల అయింది.ఈ ప్రైమ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ 8GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.0 OS ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ నాలుగు OS అప్‌డేట్‌లు, 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందనుందని శాంసంగ్ తెలిపింది.
50MP కెమెరా, 6000mAh భారీ బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా ప్రైమ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరాతోపాటు 5MP, 2MP కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ 13MP కెమెరాను అమర్చారు. 25W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.