కాన్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజృంభిస్తోంది. నాలుగో రోజు తొలి ఇన్నింగ్‌లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగింది.తొలుత ప్రత్యర్థిని 233 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తోంది.టీమిండియా బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాటర్లెవరూ నిలవలేకపోయారు.. ఒక్క మొమినుల్ హక్ మినహా. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన హక్.. ఒక సిక్సర్, 17 బౌండరీలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 107 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మిగలిన బ్యాటర్లెవరూ కూడా భారీ స్కోర్ చేయడంలో ఘోరంగా విఫలం అయ్యారు.
పెనర్ జకీర్ హసన్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ షద్మన్ ఇస్లాం- 24, కేప్టెన్ నాజ్ముల్ హొస్సేన్ శాంటో- 31, ముష్ఫికర్ రహీం- 11, షకీబల్ హసన్- 9, లిట్టన్ దాస్- 13, మెహదీ హసన్ మిర్జా- 20, తైజుల్ ఇస్లాం- 5, హసన్ మహమూద్- 1, ఖలేద్ అహ్మద్ డకౌట్ అయ్యారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా దుమ్ము రేపింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ భారీ షాట్లతో బంగ్లాదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. రోహిత్ శర్మ తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలచడం అద్భుతః అనిపించింది. 11 బంతుల్లో మూడు భారీ సిక్సర్లు, ఒక ఫోర్‌తో 23 పరుగులు చేశాడు రోహిత్.
ఎక్కువ సేపు క్రీజ్‌లో నిల్చోలేకపోయాడు. హసన్ మీర్జా బౌలింగ్‌లో మెహదీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. దీనితో 76 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత్. ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన రికార్డును నెలకొల్పింది రోహిత్ శర్మ- యశస్వి జైస్వాల్ జోడి. టెస్టు మ్యాచ్‌లల్లో శరవేగంగా 50 పరుగులను జోడించారు.
వారిద్దరి సునామీ ఇన్నింగ్‌కు మూడు ఓవర్లల్లోనే 50 పరుగుల మార్క్‌ను అందుకుంది టీమిండియా. ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఏ టీమ్ అయినా ఇంత వేగంగా 50 పరుగులు చేయడం ఇదే తొలిసారి. గతంలో 26 బంతులకు ఇంగ్లాండ్ 50 పరుగులు చేసింది. ఇప్పుడది మరుగునపడింది.
ఇదే మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ తన పేరు మీద మరో సరికొత్త రికార్డును లిఖించుకున్నాడు. శరవేగంగా హాఫ్ సెంచరీ చేశాడు. దీనికోసం అతను ఆడిన బంతులు 31. 31 బంతుల్లో 50 పరుగులు చేసిన మూడో టీమిండియా బ్యాటర్ అతనే. అతని కంటే ముందు వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 28 బంతుల్లో, లెజెండరీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ 30 బంతుల్లో టెస్టుల్లో అర్ధసెంచరీ అందుకున్నారు.
ఈ క్రమంలో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును తుడిచిపెట్టాడు జైస్వాల్. గతంలో 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు సెహ్వాగ్. ఇప్పుడది కనుమరుగైంది. ఇదివరకు ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ కూడా 31 బంతుల్లోనే 50 పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్ల జాబితాలో ఉన్నాడు.