టీమిండియా మాజీ బ్యాటర్ సురేశ్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి నాలుగేళ్లు గడిచినా తన బ్యాటింగ్‌లో ఏ మాత్రం దూకుడు తగ్గలేదని నిరూపించాడు.అమెరికా వేదికగా జరుగుతున్న నేషనల్ క్రికెట్ లీగ్‌లో బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. న్యూయార్క్లయన్స్‌కు సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రైనా 28 బంతుల్లో అజేయంగా 53 పరుగులు చేశాడు.రైనా ఆరు బౌండరీలు, మూడు సిక్సర్లు బాదాడు. షకిబ్ అల్ హసన్ ఓవర్‌లో భారీ సిక్సర్లతో చెలరేగాడు. రైనా ధాటికి షకిబ్ ఒకే ఓవర్‌లో 18 పరుగులు ఇచ్చాడు. అంతేగాక తిరిగి బౌలింగ్‌కు రాలేదు. రైనా అర్ధశతకంతో పాటు ఉపుల్ తరంగ (40; 23 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా విజృంభించడంతో న్యూయార్క్ నిర్ణీత 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.
బెన్ కటింగ్ (12 నాటౌట్; 7 బంతుల్లో, 1 సిక్సర్) పరుగులు చేశాడు. లాస్ ఏంజిల్స్ వేవ్స్ బౌలర్లలో టైమల్ మిల్స్ మూడు వికెట్లు, టాడ్ ఆస్టిల్ రెండు వికెట్లు తీశారు. కాగా, అనంతరం ఛేదనలో లాస్ ఏంజిల్స్ 10 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 107 పరుగులకే పరిమితమైంది. ఆడమ్ రోసింగ్టన్ (31; 15 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్. శౌర్య గౌర్ మూడు, షంసీ రెండు వికెట్లు తీశారు.కాగా, 37 ఏళ్ల సురేశ్ రైనా టీమిండియా తరఫున 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 768 పరుగులు, వన్డేల్లో 5615 పరుగులు, టీ20ల్లో 1604 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా 62 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో 205 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మిష్టర్ ఐపీఎల్ 5528 పరుగులు, 28 వికెట్లు తీశాడు. 2020లో రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై పలికాడు.