దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన మిడ్ రేంజ్ శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఇటీవలే గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించిన శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ ఫోన్ బ్లూ బ్లాక్, గోల్డ్, లైట్ గ్రీన్ రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది. ఆరేండ్ల పాటు సెక్యూరిటీ, ఆరేండ్ల పాటు ఓఎస్ అప్ డేట్స్ అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ ఫోన్ 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.23 వేలు (249 యూరోలు) పలుకుతుంది.శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 సూపర్ అమోలెడ్ స్క్రీన్, ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ విత్ ఆల్ట్రా వైడ్ లెన్స్ ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ ఫోన్ ఎక్స్ నోస్ 1330 ఎస్వోసీ చిప్ సెట్ తో గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించారు. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2340 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ వన్ యూఐ 6.1 ఓఎస్ పై పని చేస్తుంది.శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 5-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రావైడ్ లెన్స్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 25 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. డ్యుయల్ 5జీ, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, బ్లూటూత్ 5.3, వై-ఫై, యూఎస్బీ టైప్ సీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.