స్మాల్ క్యాప్ కేటగిరికి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టార్ స్టాక్ క్రెడెంట్ గ్లోబల్ ఫైనాన్స్ లిమిటెడ్ అదరగొట్టింది. గత ఐదేళ్లలో లక్ష రూపాయలను రూ.10 లక్షలు చేసి మల్టీబ్యాగర్ స్టాక్‌గా నిలిచింది. ఇప్పుడు స్టాక్ స్ప్లిట్ చేపట్టేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలుపింది. ఇందుకుసంబంధించిన రికార్డు తేదీ మరో రెండు రోజులే ఉంది. ఆ రోజున ఎక్స్ స్ప్లిట్ ట్రేడింగ్ చేయనుంది. కంపెనీ చరిత్రలోనే తొలిసారి స్టాక్ స్ప్లిట్ చేపడుతుండడం గమనార్హం. ఈ స్టాక్ స్ప్లిట్ అనంతరం రూ. 147 వద్ద ఉన్న షేర్ ధర రూ. 30 ల స్థాయికి దిగిరానుంది.
కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశమై 1:5 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేపట్టేందుకు ఆమోదం లభించింది. అంటే రూ. 10 ముఖ విలువ గల ఒక ఈక్విటీ షేరును.. రూ. 2 ఫేస్ వ్యాల్యూ గల 5 ఈక్విటీ షేర్లుగా విభజించనున్నారు. ఈ స్టాక్ స్ప్లిట్ కి సంబంధించిన రికార్డు డేట్ అక్టోబర్ 15, 2024గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ఎవరైతే ఈ రికార్డు తేదీ నాటికి తమ డీమ్యాట్ ఖాతాలో ఈ కంపెనీ షేర్లు కలిగి ఉంటారో వారు మాత్రమే అర్హులని స్పష్టం చేసింది.
మరోవైపు.. క్రెడెంట్ గ్లోబల్ ఫైనాన్స్ షేరుకు బై రేటింగ్ ఇస్తున్నట్లు ప్రముఖ అనలిస్ట్ ఏ ఆర్ రామచంద్రన్ సూచించారు. కొత్త టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. ఈ కంపెనీ షేరుకు రూ. 160గా కొత్త టార్గెట్ ప్రైస్ ఇస్తున్నట్లు వీఎల్ఏ అంబాలా సూచించారు. ఈ షేరుకు రూ. 138 స్టాప్ లాస్ ఏర్పాటు చేసుకోవాలని స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు సూచించారు. రానున్న కొద్దీ రోజుల్లోనే ఈ స్టాక్ ఇచ్చిన టార్గెట్ చేరుకుంటుందని అంచనా వేశారు. చివరి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్‌లో ఈ కంపెనీ షేరు ధర 0.8 శాతం నష్టంతో రూ. 147 వద్ద స్థిరపడింది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 168.65, 52 వారాల కనిష్ఠ ధర రూ. 109.05 వద్ద ఉన్నాయి. గత వారంలో 1 శాతం లాభపడగా.. గత నెల రోజుల్లో 1 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో 1 శాతం నష్టపోయింది. గత ఏడాదిలో 2 శాతం లాభాన్ని ఇచ్చింది. అయితే గత ఐదు సంవత్సరాల్లో చూసుకుంటే 910 శాతం మేర లాభాలు అందించింది. లక్ష రూపాయలను రూ.10 లక్షలు చేసి చూపించింది.