ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త నానో ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

business |  Suryaa Desk  | Published : Thu, Oct 17, 2024, 12:36 PM

సామాన్యులకు సైతం కారు ఉండాలనేది దివంగత బిజినెస్ మేన్ రతన్ టాటా కోరిక. అందుకే 2017లో కేవలం రూ. లక్ష రూపాయలతో NANO కారును అందుబాటులోకి తీసుకొచ్చారు.అయితే కొందరికి ఇది ఉపయోగకరంగా ఉన్నా.. చాలా మంది దీనిని లైక్ చేయలేదు. అందుకే కొన్ని సంవత్సరాలకే దీని ఉత్పత్తిని ఆపేశారు. టాటా కంపెనీ నుంచి ఎన్నో మోడళ్లు ఆ తరువాత వచ్చాయి.కానీ లక్ష రూపాయల రేంజ్ లో మరో కారు ఏ కంపెనీ తీసుకురాలేదు.అయితే ఇదే టాటా కంపెనీ ఇప్పటి తరానికి నచ్చేలా కాస్త హంగులు, టెక్నాలజీని జోడించి కొత్త నానోను తీసుకొస్తుంది. ఇప్పుడంతా ఈవీ కార్లు అందుబాటులోకి రావడంతో దీనిని ఎలక్ట్రిక్ వెర్షన్ లో తీసుకొస్తున్నారు. దీని గురించి ఇప్పటికే అనౌన్స్ చేశారు. మరి ఇందులో ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?రతన్ టాటా మరో కలల ప్రాజెక్టు పూర్తి కాకముందే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. అయితే ఆయన లేకున్నా ఆయన ప్రాజెక్టులు మాత్రం ఆగడం లేదు. టాటా కంపెనీ నుంచి కొత్త నానో రావడానికి సిద్ధమవుతోంది. ఇది పూర్తిగా ఈవీ వెర్షన్. దీని గురించి ఇప్పటికే ప్రకటించారు. కానీ కొన్ని అంచనాల ప్రకారం కొత్త నానోను 2024 ఏడాది చివర్లో మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న ఈవీలు ఒకదానికంటే ఒకటి భిన్నంగా ఉన్నాయి. మరి కొత్త నానో ఎలాంటి ఫీచర్లు, మైలేజ్, ధరను కలిగి ఉందోనని అందరికీ ఆసక్తి నెలకొంది.


కొత్త నానో ఎలక్ట్రిక్ కారు మిగతా కార్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇందులో 15 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 312 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉంది. కానీ పరిమాణంలో కాస్త చిన్నదిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయినా ఇందులో 4గురు ప్రయాణికులు సౌకర్యవంతంగా వెళ్లొచ్చు. ఇందులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉండనుంది. సౌండింగ్ కోసం 6 స్పీకర్లను అమర్చారు. పవర్ స్టీరింగ్, పవర్ విండ్ ఇందులోని ఫీచర్ల ప్రత్యేకత. యాంటీ లాకింగ్ బ్రేక్ సిస్టమ్ తో ఉన్న ఈ కారు 10 సెకన్లలో 100 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లే సత్తా ఉంది.


చాలా మంది కొత్త నానో కారు ధర ఎంత ఉండనుంది? అని చర్చించుకుంటున్నారు. గతంలో నానోను లక్ష రూపాయలకు అందించిన టాటా కంపెనీ దీని ధరను ఏ విధంగా ప్రకటిస్తారు? అని ఎదురుచూస్తున్నారు. అయితే టాటా కంపెనీ కొత్త నానో ధరను అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ దీనిని రూ.3 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తారని తెలుస్తోంది. టాప్ ఎండ్ వేరియంట్ రూ.5 నుంచి 8 లక్షల వరకు ఉండనుంది. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత తక్కువ ధరతో ఎంజీ కామెట్ రూ. 5 లక్షల ప్రారంభధరతో విక్రయిస్తున్నారు. దీని కంటే తక్కువ ధరకే టాటా నానో లేటేస్ట్ వెర్షన్ ను అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com