ప్రో కబడ్డీ లీగ్ 2024లో తొలి మ్యాచ్‌లోనే తెలుగు టైటాన్స్ బోణీ కొట్టింది. శుక్రవారం బెంగళూరు బుల్స్‌పై 37-29 తేడాతో ఘన విజయం సాధించింది. తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ షెరావత్ 13 పాయింట్లు సాధించాడు. బెంగళూరుస్టార్ ప్లేయర్ పర్‌దీప్ నర్వాల్ రెండు పాయింట్లతో నిరాశపరిచాడు. ప్రో కబడ్డీ లీగ్ 2024 శుక్రవారం నుంచి మొదలైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌పై 37-29 తేడాతో తెలుగు టైటాన్స్ ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ షెరావత్ అదరగొట్టాడు. ఎనిమిది రైడ్ పాయింట్స్ సాధించి బెంగళూరు బుల్స్‌కు చుక్కలు చూపించాడు. మరో ఐదు బోనన్ పాయింట్స్‌తో కలిసి మొత్తం ఈ మ్యాచ్‌లో పవన్ షెరావత్ పదమూడు పాయింట్స్ సాధించాడు. రైడింగ్‌లోనే కాకుండా ట్యాక్లింగ్‌లో తెలుగు టైటాన్స్ తొలి మ్యాచ్‌లో పటిష్టంగా కనిపించింది. కృష్ణన్ (ఆరు పాయింట్లు), సాగర్ రావల్ (మూడు పాయింట్లు) ట్యాక్లింగ్‌లో సత్తాచాటి బెంగళూరు ప్లేయర్ల దూకుడును అడ్డుకున్నారు.
డుమ్కీ కింగ్‌గా పేరుతెచ్చుకున్న స్టార్ కబడ్డీ ప్లేయర్ పర్‌దీప్ నర్వాల్ విఫలం కావడం బెంగళూరును దెబ్బకొట్టింది. పర్‌దీప్ నర్వాల్ ఈ మ్యాచ్‌లో కేవలం మూడు పాయింట్లు మాత్రమే సాధించాడు. అజింక్య పవార్, రోహిత్ కుమార్‌తో పాటు రైడింగ్‌లో ఒక్క పాయింట్ సాధించలేకపోయారు. ట్యాక్లింగ్‌లో సురిందర్‌సింగ్, సౌరభ్ నంద్, నితిన్ రావల్ రాణించిన రైడింగ్‌లో ఆ జోరు కొనసాగలేకపోవడంతో తొలి మ్యాచ్‌లోనే బెంగళూరు ఓటమి పాలైంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ షెరావత్‌కు దక్కింది.