న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా అదరగొడుతుంది. నాలుగో రోజు ఉదయం ఆట ప్రారంభమైనప్పటి నుంచి.. రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్ రెచ్చిపోయి ఆడుతున్నారు. ఈ తరుణంలోనే తొలి టెస్టులో సెంచరీ నమోదు చేసుకున్నాడు సర్ఫరాజ్ ఖాన్. సూపర్ సెంచరీ తో రెచ్చిపోయాడు. కేవలం 110 బంతుల్లోనే 100* సెంచరీ నమోదు చేసుకున్నాడు సర్ఫరాజ్. ఇందులో మూడు సిక్సర్లు 13 ఫోర్లు ఉన్నాయి. మొదటి ఇన్నింగ్స్ లో డక్ అవుట్ అయిన సరఫరాజ్ ఖాన్.. రెండో ఈన్నింగ్స్ లో మాత్రం దుమ్ములేపాడు. కష్టాల్లో ఉన్న టీమిండియాను ఆదుకున్నాడు. ఇక టీమిండియాను ఆదుకున్న నేపథ్యంలో అతనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ద గ్రేట్ మాన్ అంటు కొనియాడుతున్నారు.
ఇక అటు రిషబ్ పంత్ 53 పరుగులతో రాణిస్తున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో 20 పరుగులు చేసిన పంత్ ఇప్పుడు దుమ్ము లేపుతున్నాడు. ఇక లంచ్ బ్రేక్ సమయానికి మ్యాచ్ కు వర్షం కూడా అంతరాయం ఏర్పడింది. దీంతో లంచ్ బ్రేక్ ప్రకటించేశారు. లంచ్ బ్రేక్ సమయానికి మూడు వికెట్లు నష్టపోయిన టీమిండియా 344 పరుగులు చేసింది. 12 పరుగుల చేస్తే లీడ్ లోకి వస్తుంది. ఇవాళ సాయంత్రం వరకు… మరో 300 స్పీడ్ గా ఆడి కొడితే… రేపు న్యూజిలాండ్ కు బ్యాటింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంది.